రాజకీయ అర్ధశాస్తాన్ని నిశితంగా అధ్యయనం చేసిన తరువాత అనేక సంవత్సరాలకు మార్క్ పెట్టుబడి గ్రంథాన్ని రాయడం ప్రారంభించాడు. ఆయన 1843 నాటికే ఈ అధ్యయనం ప్రారంభించాడు. తనదైన ఆర్థిక అవగాహన సాధించడానికి ఈ అధ్యయనం దోహదం చేసిందని ఆయన కొంతకాలం తరువాత స్పష్టం చేశాడు. 1857లో హఠాత్తుగా సంభవించిన ఆర్థిక సంక్షోభం మార్క్‌ను పెట్టుబడి గ్రంథం రాయటానికి పురికొల్పింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న సంక్షోభం యూరోప్ అంతటా నూతన విప్లవ దశకు అవసరమైన పరిస్థితులను సృష్టిస్తుందని మార్చ్ భావించాడు. 1848లో తిరుగుబాట్లు జరిగిన తరువాత ఇటువంటి క్షణం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సంఘటనలు హఠాత్తుగా తనను చుట్టుముట్టడం ఆయనకు ఇష్టం లేదు. అందువల్ల ఆర్థికాంశాల అధ్యయనం తిరిగి కొనసాగించాలని, దానికి పుస్తక రూపం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు.
1. (గగ్రుండ్రిజె (Grundrisse) మొదలుకొని
అదనపు విలువ సిద్ధాంతాల విమర్శనాత్మక విశ్లేషణ వరకు 5
2. మూడు వాల్యూమ్‌లు రాయటం 20
3. వాల్యూమ్ 1 పూర్తి చేయడం 27
4. నిర్ణయాత్మక వ్యక్తీకరణ కోసం అన్వేషణ 37
Marcello
Musto